News May 11, 2024
వైఎస్సార్ ఘాట్ వద్ద రాహుల్ నివాళులు

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాహుల్ కాసేపట్లో కడప బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాహుల్ వెంట కేసీ వేణుగోపాల్, షర్మిల ఉన్నారు.
Similar News
News February 9, 2026
364 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in
News February 9, 2026
రేపు స్పీకర్‌పై అవిశ్వాస అస్త్రం!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష MPలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ మహిళా MPలపై నిరాధార ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.
News February 9, 2026
లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా?

లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్ నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి లిప్‌స్టిక్‌ను పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. కెమికల్స్, పారాబెన్ లేని లిప్‌స్టిక్‌ను మాత్రమే ఎంచుకోండి. లిప్ స్టిక్ వేసుకునే ముందు బేస్ కోసం కన్సీలర్ ఉపయోగించండి. ప్రెగ్నెన్సీలో వాడకపోవడమే మంచిది.


