News August 12, 2024
రాహుల్ జీవితాంతం ప్రతిపక్షంలోనే: కంగన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని BJP ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. ప్రధాని కాలేకపోతే దేశాన్ని నాశనం చేయడమే ఆయన అజెండా అని దుయ్యబట్టారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకొని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ‘దేశ భద్రత, ఆర్థిక స్థితిని అస్థిర పరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉంటారు. ఆయనను ఎప్పటికీ నాయకుడిగా చేసుకోరు’ అని అన్నారు.
Similar News
News September 21, 2024
OCT 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్
AP: మహాలయ అమావాస్య దృష్ట్యా అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఆర్‌జేయూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా 3న కూడా సెలవు ఇస్తే ధార్మిక క్రతువులకు వీలుంటుందని ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ప్రకటించింది. అటు ఇటీవల భారీ వర్షాలతో సెలవులు ఇచ్చినందువల్ల ఈ దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
News September 21, 2024
లిఫ్ట్‌లకు నో చెప్పి రోజూ మెట్లు ఎక్కితే..
కాళ్లకు పనిచెప్పకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉపయోగించడం పెరిగింది. అయితే రోజూ మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తొడ కండరాలు, పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుందని, చక్కటి శరీరాకృతి వస్తుందని పేర్కొంటున్నారు. వేగంగా కాకుండా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కాలంటున్నారు. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాలు, మడమ, కీళ్ల నొప్పులు ఉన్నవారు మెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 21, 2024
ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రి పొంగులేటి భేటీ
TG: రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. మ.2గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి రెవెన్యూ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. వీఆర్‌వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పెండింగ్ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.