News April 3, 2024
నేడు వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీ, కె.సి.వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ వంటి లీడర్లు పాల్గొననున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో ఈ రోడ్‌షో సాగుతుంది. కాగా 2019లో రాహుల్.. 10లక్షల ఓట్లలో 7లక్షల ఓట్లు సాధించి గెలిచారు.
Similar News
News March 24, 2026
‘కురు వృద్ధులు’ అని ఎవరిని అంటారు?

రాజకీయాలు, ఇతర రంగాలలో చాలా అనుభవం ఉన్న వ్యక్తులను గౌరవించడానికి ‘కురు వృద్ధులు’గా పిలుస్తున్నారు. మహాభారతంలోని కురువంశంలో ప్రముఖులు, వయసుమీరిన వారిని ప్రస్తావించేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా భీష్ముడు, ధృతరాష్ట్రుడిని కురు వృద్ధులుగా సంబోధిస్తారు. కాలక్రమంలో ఇదొక జాతీయమైంది. పాలిటిక్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉదా. రాజకీయ కురు వృద్ధుడు అద్వాణీ.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 24, 2026
ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన స్విగ్గీ.. నెటిజన్ల అసహనం!

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జొమాటో ₹13.50గా ఉన్న ఫీజును ₹14,90 చేసింది. తాజాగా స్విగ్గీ ₹14.99 నుంచి ₹17.58కి పెంచింది. చమురు ధరలు పెరగడం, ఇంధన కొరతే పెంపునకు కారణంగా తెలుస్తుండగా దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని అంటున్నారు.
News March 24, 2026
క్యాబినెట్ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

TG: రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కేరళం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక క్యాబినెట్ విస్తరణ చేసుకోవచ్చని CM రేవంత్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులకోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. అధిష్ఠానం, CMను కలిసి విన్నవిస్తున్నారు. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, మల్రెడ్డి రంగారెడ్డి వంటివారు ఈ రేసులో ఉన్నారు.


