News April 3, 2024

నేడు వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీ, కె.సి.వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ వంటి లీడర్లు పాల్గొననున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో ఈ రోడ్‌షో సాగుతుంది. కాగా 2019లో రాహుల్.. 10లక్షల ఓట్లలో 7లక్షల ఓట్లు సాధించి గెలిచారు.

Similar News

News February 12, 2026

బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

image

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

News February 12, 2026

కూరగాయ పంటల్లో తెగుళ్లు- కట్టడి సూచనలు

image

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.

News February 12, 2026

హలో అనేందుకు మంత్రుల హడల్

image

తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న మంత్రి పొంగులేటి ఆరోపణ బాంబు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ టూల్స్‌తో BRS ట్యాప్ చేయిస్తుందేమోనని అనుమానిస్తున్న మంత్రులు నార్మల్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. కొందరు మినిస్టర్స్ కొన్ని కాల్స్ అటెంప్ట్ చేసినా పైపై మాటలే. డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. ముఖ్య విషయాలు డిస్కస్ చేసేందుకు వాట్సాప్ కాల్ లేదా యాపిల్ ఫేస్ టైం వాడుతున్నారని సమాచారం.