News September 9, 2024
వినేశ్, పునియా రాజీనామాలకు రైల్వే ఆమోదం

భారత రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజ్రంగ్ పునియా రాజీనామాలను రైల్వే శాఖ ఆమోదించింది. వారిద్దరూ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. హరియాణా ఎన్నికల నేపథ్యంలో వీరు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వినేశ్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బజరంగ్ పునియాను కాంగ్రెస్ తమ కిసాన్ వింగ్ వర్కింగ్ ఛైర్మన్గా నియమించింది.
Similar News
News January 22, 2026
సౌతాఫ్రికా WC జట్టులో మార్పులు

T20 WC జట్టులో SA మార్పులు చేసింది. బ్యాటర్లు జోర్జి, ఫెరీరా గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారని, వారి స్థానాల్లో స్టబ్స్, రికెల్టన్ను తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు మిల్లర్ కండరాల గాయంతో బాధపడుతున్నారని, ఫిట్నెస్ టెస్టులో పాసైతేనే ఆయన WCలో ఆడతారని తెలిపింది.
టీమ్: మార్క్రమ్(C), బాష్, బ్రెవిస్, డికాక్, జాన్సెన్, లిండే, కేశవ్, మఫాకా, మిల్లర్, ఎంగిడి, నోర్ట్జే, రబాడ, రికెల్టన్, స్మిత్, స్టబ్స్
News January 22, 2026
చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’

ర్యాన్ క్లూగర్ డైరెక్షన్లో మైఖేల్ బి.జోర్డాన్ నటించిన ‘సిన్నర్స్’ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఆస్కార్ నామినేషన్స్లో 16 కేటగిరీల్లో చోటు దక్కించుకుంది. గతంలో All About Eve(1950), Titanic(1997), La La Land(2016) 14 కేటగిరీల చొప్పున నామినేషన్స్లో నిలిచాయి. ఇప్పుడు వాటి రికార్డును సిన్నర్స్ బద్దలుకొట్టింది. హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ అందుకుంది.
News January 22, 2026
2025-DSC సెలెక్టడ్ SA టీచర్లకు పే ప్రొటక్షన్

AP: SGT లేదా ఇతర ప్రభుత్వ పోస్టులకు రాజీనామా చేసి 2025 DSCలో స్కూల్ అసిస్టెంట్లుగా చేరిన టీచర్లకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పాత పోస్టులో చేరిన తేదీ నుంచి సర్వీసు కొనసాగుతుందని, వారికి పే ప్రొటెక్షన్ కల్పించాలని DEOలకు ఆదేశాలిచ్చింది. పే ప్రొటక్షన్ కోసం వారి అభ్యర్థనలపై నిబంధనలను అనుసరించి వేతన రక్షణ సహా ఇతర చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో రాజీనామా చేసిన పోస్ట్ ఆధారంగా శాలరీ ఉండనుంది.


