News September 9, 2024

వినేశ్, పునియా రాజీనామాలకు రైల్వే ఆమోదం

image

భారత రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజ్‌రంగ్ పునియా‌ రాజీనామాలను రైల్వే శాఖ ఆమోదించింది. వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హరియాణా ఎన్నికల నేపథ్యంలో వీరు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వినేశ్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బజరంగ్‌ పునియాను కాంగ్రెస్ తమ కిసాన్ వింగ్ వర్కింగ్ ఛైర్మన్‌గా నియమించింది.

Similar News

News April 16, 2026

యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

image

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే ఆ దేశంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్‌లో నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ డిన్నర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హార్ముజ్‌ను దిగ్బంధించినట్లు టాక్. అదే నిజమైతే భారత్ సహా పలు దేశాలు మరికొన్నాళ్లు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News April 16, 2026

వీళ్లూ ITR ఫైల్ చేయాల్సిందే!

image

ITR ఫైల్ చేయడం ఆదాయంపైనే ఆధారపడి ఉండదు. కొన్ని రకాల ఖర్చులు లేదా లావాదేవీలు పరిమితి దాటితే తప్పనిసరి. *సేవింగ్స్ అకౌంట్‌లో ₹50 లక్షలు, కరెంట్ అకౌంట్‌లో ₹కోటి డిపాజిట్ చేస్తే. *ఏడాదికి కరెంటు బిల్లు ₹లక్ష దాటితే. *బిజినెస్ టర్నోవర్ ₹60 లక్షలు దాటితే. *ప్రొఫెషనల్ ఇన్కమ్ ₹10 లక్షల పైన ఉంటే. *TDS లేదా TCS రూపంలో ₹25 వేలు అంతకంటే ఎక్కువ కట్ అయితే ఆదాయం పన్ను పరిమితిలో లేకపోయినా ITR ఫైలింగ్ తప్పనిసరి.

News April 16, 2026

27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్‌ & సింధ్‌ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.