News December 14, 2024
ఆ జిల్లాలకు వర్ష సూచన

AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
Similar News
News October 29, 2025
భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.
News October 29, 2025
ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

TG: ఫీజు రీయింబర్స్మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
News October 29, 2025
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ₹10 కోట్లు

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.


