News December 14, 2024

ఆ జిల్లాలకు వర్ష సూచన

image

AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

Similar News

News January 20, 2025

నేటి నుంచి WEF.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

ప్రపంచ ఆర్థిక సదస్సు(WEF) నేటి నుంచి దావోస్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్లారు. మూడు రోజులపాటు CBN బృందం, నాలుగు రోజుల పాటు రేవంత్ బృందం సమావేశంలో పాల్గొననుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరురాష్ట్రాల సీఎంలు దృష్టిపెట్టారు. ఈ సదస్సులో భారత్ సహా పలు దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటారు.

News January 20, 2025

నీరజ్ చోప్రా భార్య ఎవరో తెలుసా?

image

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ <<15200143>>నీరజ్ చోప్రా పెళ్లి<<>> చేసుకున్న అమ్మాయి పేరు హిమాని మోర్. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన 25 ఏళ్ల హిమాని జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్. ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో రాజనీతిశాస్త్రం, వ్యాయామ విద్యలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన కోర్సు చేస్తున్నారు.

News January 20, 2025

కాళేశ్వరం విచారణ.. నేడు KCRకు నోటీసులు?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ CM కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌(మాజీ ఆర్థిక మంత్రి)ను విచారణకు పిలిచే అవకాశముంది. ఇవాళ ఈ నేతలకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, రిటైర్డ్ ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులను ప్రశ్నించింది.