News May 26, 2024

తెలంగాణలోని ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం

image

TG: మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్‌, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

Similar News

News February 12, 2025

వాట్సాప్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తూ మరిన్ని కొత్తసేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాకినాడలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు, దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి క్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

News February 12, 2025

నేడే VD12 టీజర్.. ఎడిటర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో దీనిపై మరింత హైప్ పెంచేలా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గౌతమ్ నుంచి ఇలాంటిది ఊహించలేదు. VD12 టీజర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గత రెండేళ్లుగా మేము సృష్టించిన ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. వాయిస్, మ్యూజిక్ అదిరిపోతాయి’ అని పేర్కొన్నారు.

News February 12, 2025

ఆమె నోరు తెరిచిందంటే మగాళ్లపై బూతులే: FIR నమోదు

image

‘ఇండియా గాట్ లాటెంట్’ షో జడ్జి, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వా మఖీజాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సహా కొన్ని షోల్లో యథేచ్ఛగా బూతులు మాట్లాడటంపై FIR ఫైల్ చేశారు. మొన్న పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్‌గా మాట్లాడిన యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాపై కేసు బుక్కైంది. ఇందులో పాల్గొన్న యువతి అపూర్వను పట్టించుకోలేదు. దీంతో మగాళ్లు మాత్రమే శిక్షకు అర్హులా, అమ్మాయిలు కాదా అని విమర్శలు వచ్చాయి.

error: Content is protected !!