News October 17, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని చాలా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, యాదాద్రి, WGL, సూర్యాపేట, సిద్దిపేట, RR, కరీంనగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Similar News

News July 10, 2025

BREAKING: ఢిల్లీలో భూకంపం

image

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

News July 10, 2025

ఛంగూర్ బాబా: సైకిల్ నుంచి రూ.100 కోట్ల ఆస్తి!

image

UPలో అనధికార మత మార్పిడులకు పాల్పడుతున్న ఛంగూర్ బాబా కేసు వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడికి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నట్లు, 40 బ్యాంకు ఖాతాలు, రూ.106 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాబా గతంలో సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునేవాడు. అతడు బలరాంపూర్(D) రెహ్రా మాఫీలో ఓ భారీ భవనం నిర్మించుకోగా యోగి సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేసింది.

News July 10, 2025

నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు: విద్యా బాలన్

image

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో నటించాల్సిన ‘చక్రం’ సినిమా ఆగిపోవడంతో తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని నటి విద్యా బాలన్ తెలిపారు. కానీ హీరో, డైరెక్టర్‌కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్లే ఆ మూవీ ఆగిపోయిందన్నారు. ‘ఆ ఒక్క సినిమా ఆగిపోవడం వల్ల నేను 8-9 ప్రాజెక్టులు కోల్పోయా. రాత్రికి రాత్రే అంతా కోల్పోయా. కొన్ని సినిమాల్లో షూట్ కంప్లీట్ అయ్యాక కూడా నన్ను తొలగించారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.