News July 17, 2024
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల, ఖమ్మం, అసిఫాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వాన పడనున్నట్లు పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 22, 2026
RITES లిమిటెడ్ 48 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 22, 2026
సీఎం రేవంత్‌తో మంత్రి లోకేశ్ భేటీ

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్‌మెంట్‌పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.
News January 22, 2026
భోజ్‌శాలలో సరస్వతీ పూజ, నమాజ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ధార్(MP)లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.


