News July 17, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల, ఖమ్మం, అసిఫాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వాన పడనున్నట్లు పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Similar News

News December 1, 2024

ఈ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు

image

AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు డిసెంబర్ 2న సెలవు ప్రకటించారు. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రకటించారు. విద్యాసంస్థలన్నీ సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

News December 1, 2024

‘పీలింగ్స్’పై స్పందించిన రష్మిక.. అల్లు అర్జున్ కామెంట్ ఇదే!

image

పుష్ప-2 నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. డాన్స్ విషయంలో తన కెరీర్లో ఇప్పటి వరకూ ఇదే అత్యంత కష్టమైన సాంగ్ అని రష్మిక ట్వీట్ చేశారు. ‘పీలింగ్స్ సాంగ్ ఫుల్ వైబ్, ఫుల్ మాస్. ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయం. అల్లు అర్జున్ సార్ వల్ల ఆ భయాన్ని దాటాను. చాలా కష్టమైన పాట కానీ ఎంజాయ్ చేశాను’ అని పేర్కొన్నారు. అద్భుతంగా డాన్స్ చేశారంటూ ‘యూ రాక్డ్’ అని అల్లు అర్జున్ ఆమెకు బదులిచ్చారు.

News December 1, 2024

అలా అయితే దేశం వృద్ధి చెందదు: రాహుల్

image

ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌యోజ‌నాలు కొద్ది మంది బిలియ‌నీర్ల‌కే దక్కినంత కాలం దేశం వృద్ధి చెందదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పేద‌ల ఆర్థిక సమస్యలు పరిష్కారమైతేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 14 నెల‌ల క‌నిష్ఠానికి, GDP వృద్ధి రెండేళ్ల క‌నిష్ఠ స్థాయి 5.4 శాతానికి ప‌డిపోవ‌డం ఆందోళ‌న‌క‌ర‌మ‌న్నారు. అంద‌రికీ స‌మాన అవ‌కాశాల‌తో ఆర్థిక వ్య‌వస్థ‌కు కొత్త ఆలోచ‌న‌లు అవ‌స‌ర‌మ‌న్నారు.