News May 26, 2024

IPL ఫైనల్‌కు వర్షం ముప్పు

image

ఇవాళ SRH, KKR జట్ల మధ్య జరిగే ఐపీఎల్-17 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అంచనా. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేదు. ఒకవేళ ఇవాళ వర్షం పడినా రేపు రిజర్వ్ డే ఉంది. అటు నిన్న సాయంత్రం కూడా చెపాక్ సమీపంలో వర్షం పడటంతో KKR ప్రాక్టీస్ సెషన్ రద్దైంది.

Similar News

News January 9, 2026

SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

image

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L, AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://sbi.bank.in/

News January 9, 2026

జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.

News January 9, 2026

హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు కొట్టివేత

image

టాలీవుడ్ హీరో నవదీప్‌కు TG హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అధికారులు పలుమార్లు ఆయనను విచారించారు.