News May 26, 2024

IPL ఫైనల్‌కు వర్షం ముప్పు

image

ఇవాళ SRH, KKR జట్ల మధ్య జరిగే ఐపీఎల్-17 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అంచనా. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేదు. ఒకవేళ ఇవాళ వర్షం పడినా రేపు రిజర్వ్ డే ఉంది. అటు నిన్న సాయంత్రం కూడా చెపాక్ సమీపంలో వర్షం పడటంతో KKR ప్రాక్టీస్ సెషన్ రద్దైంది.

Similar News

News February 18, 2025

కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

image

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.

News February 18, 2025

వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్‌సీలో ఇప్పటికే భారీ సెట్‌ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.

News February 18, 2025

బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

image

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

error: Content is protected !!