News May 12, 2024
వర్షాలు.. ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి?

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో GHMC ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.
Similar News
News February 9, 2025
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు

*షాహిద్ అఫ్రిదీ- 351 సిక్సర్లు (369 ఇన్నింగ్సులు)
*రోహిత్ శర్మ- 334 (259)
*క్రిస్ గేల్- 331 (294)
*జయసూర్య- 270 (433)
*ధోనీ- 229 (297)
*మోర్గాన్- 220 (230)
*డివిలియర్స్- 204 (218)
*మెక్‌కల్లమ్- 200 (228)
*సచిన్- 195 (452)
News February 9, 2025
నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తాం: అమిత్ షా

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. ‘ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు మరణించారు. ఈ పోరులో ఇద్దరు జవాన్లను కోల్పోయాం. వీరికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇకపై దేశంలో ఏ పౌరుడూ నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.
News February 9, 2025
మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు. అమిత్ షాను కలిసిన అనంతరం బీరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భళ్లాకు పంపారు. కాగా బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.