News April 18, 2024
రాబోయే 3 రోజులు వర్షాలు

TG: రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KMS వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది.
Similar News
News December 6, 2025
కొత్తదనం ఏమీ లేదు: జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర

గత ప్రభుత్వం 2023లో తీసుకువచ్చిన DLDO వ్యవస్థను కూటమి ప్రభుత్వం డీడీవోగా మార్పు చేసిందని, ఇందులో కొత్తదనం లేదని ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర విమర్శించారు. శుక్రవారం విశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జిల్లా పరిషత్‌కు చెందిన భవనాలనే వీటికి కేటాయించినట్లు తెలిపారు. జడ్పీ నిధులను వీటి ఆధునీకరణకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు.
News December 6, 2025
న్యూస్ రౌండప్

⋆ నేడు నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ పర్యటన
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
⋆ నేషనల్ హెరాల్డ్ కేసులో DK శివకుమార్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. DEC 19న విచారణకు రావాలని ఆదేశం
⋆ నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
⋆ శాంతిభద్రతల పరిరక్షణకు HYDలో ‘ఆపరేషన్ కవచ్’.. నిన్న అర్ధరాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 ప్రాంతాల్లో తనిఖీలు
News December 6, 2025
ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.


