News August 7, 2024

మూడు రోజుల పాటు వర్షాలు

image

AP: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, విజయనగరం, బాపట్ల, కృష్ణా, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిన్న శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో అత్యధికంగా 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Similar News

News April 19, 2026

ఆ జట్ల మధ్యే 13 IPL ట్రోఫీలు.. కానీ!

image

ముంబై, చెన్నై, కోల్‌కతా జట్ల ప్రదర్శన వాటి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ మూడు జట్లే ఏకంగా 13 IPL ట్రోఫీలు(MI-5, CSK-5, KKR-3) గెలవగా ప్రస్తుత సీజన్‌లో తేలిపోయాయి. 6 మ్యాచుల్లో 2 విజయాలతో చెన్నై PTలో 7వ స్థానంలో ఉంది. ఇక 5 మ్యాచుల్లో 1 గెలుపుతో MI 9, 6 మ్యాచుల్లో 5 ఓటమి, ఒక డ్రాతో KKR చివరి స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లలోనూ కెప్టెన్లు రాణించకపోవడం మైనస్. ఇకనైనా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News April 19, 2026

ఆ ఊళ్లో హనుమంతుడి పేరెత్తరు..

image

ఉత్తరాఖండ్‌ ద్రోణగిరిలో హనుమంతుడిని పూజించరు. రామాయణ కాలంలో లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని కోసం వచ్చిన హనుమంతుడు ఇక్కడి పర్వతాన్ని తీసుకెళ్లారని గ్రామస్థుల నమ్మకం. గ్రామదేవత అనుమతి లేకుండా కొండను తీసుకెళ్లడంతో తమ ఆరాధ్య దైవానికి అవమానం జరిగిందని వారు భావిస్తారు. అందుకే ఈ ఊరిలో హనుమంతుడి గుళ్లు, జెండాలు కనిపించవు. అయితే వారికి హనుమపై ద్వేషం లేదు. కానీ అనుమతి అడగకపోవడం సరైనది కాదని నమ్ముతారు.

News April 19, 2026

RTC ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుందా?

image

TG: ఈ నెల 22 నుంచి RTC ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో జీతాల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021, 2025 వేతన సవరణలు పెండింగ్‌లో ఉండగా, ఒక విడత వేతన సవరణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 7 లేదా 8% ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక నేతలతో చర్చించి ఫిట్‌మెంట్‌ను 10% మించకుండా ఖరారు చేసే ఛాన్సుందని, మరో వేతన సవరణపైనా హామీ ఉండొచ్చని సమాచారం.