News April 12, 2025
రాబోయే 3 రోజుల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది.
Similar News
News April 21, 2025
ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై చర్చ

‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే మొగ్గుచూపుతాడు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోదు’ అనే ఓ ఇన్‌స్టా పోస్టుకు హీరోయిన్ సమంత లైక్ కొట్టారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. సామ్ గతంలో మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాధే ఆమె విడాకులకు కారణమా? అని చర్చించుకుంటున్నారు. 2021లో చైతూ, సామ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
News April 21, 2025
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

ఇండియన్ షేర్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. ఉదయం 518 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 79,492 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 24,158 వద్ద కొనసాగుతోంది. టాటా, ఐడియా, HDFC, ఏంజిల్ వన్ కంపెనీలు టాప్ గైనర్‌లుగా ఉన్నాయి.
News April 21, 2025
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.