News June 5, 2024

రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

Similar News

News December 1, 2024

నాగబాబు ట్వీట్.. ఎవర్ని ఉద్దేశించి?

image

జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట ఆసక్తిని రేపుతోంది. ‘నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్లడం మరింత కష్టంగా మారుతుంది – స్వామి వివేకానంద’ అని పోస్ట్ చేశారు. ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ పోస్ట్ వేశారోనంటూ ట్వీట్ కింద కామెంట్లలో చర్చ నడుస్తోంది.

News December 1, 2024

ఉస్మా’నయా’ ఆస్పత్రిపై సీఎం సమీక్ష

image

TG: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి వెళ్లే రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ అధికారి దాన కిషోర్‌ను నియమించారు.

News December 1, 2024

132 ఏళ్ల సీసాలో సందేశం.. ఇప్పుడు దొరికింది!

image

132 ఏళ్ల క్రితం గాజు సీసాలో పెట్టిన సందేశమది. స్కాట్లాండ్‌లోని కోర్స్‌వాల్ లైట్‌హౌస్‌ పనితీరును ఓ మెకానికల్ ఇంజినీర్ సమీక్షిస్తుండగా గోడల్లో బయటపడింది. 1892, సెప్టెంబరు 4న ఆ లైట్‌హౌస్‌ను నిర్మించిన ముగ్గురు ఇంజినీర్లు తమ పేర్లను, ముగ్గురు సిబ్బంది పేర్లను రాసిన కాగితాన్ని సీసాలో పెట్టి గోడలో భద్రపరిచారు. అది ఇన్నేళ్లకు వెలుగుచూసింది. దాన్ని కనుగొన్న అధికారులు వారూ ఓ సీసాను పెట్టాలనుకుంటున్నారు.