News October 2, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.
Similar News
News October 5, 2024
దేశంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం!
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.
News October 5, 2024
శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఓపెనర్‌గా బరిలోకి
బంగ్లాదేశ్‌తో T20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వస్తారని కెప్టెన్ సూర్య కుమార్ ప్రకటించారు. సంజూతో అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగుతారని చెప్పారు. కాగా ఈ సిరీస్‌లో రాణిస్తే సంజూకి జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశం ఉంది. అటు అతడికి ఛాన్సులు ఎక్కువగా రాకపోవడం, వచ్చినా ఉపయోగించుకోలేకపోవడంతో జట్టులో చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఈ సిరీస్ సంజూకి గోల్డెన్ ఛాన్స్ కానుంది.
News October 5, 2024
నన్నే ఎక్కువ టార్గెట్ చేశారు: ప్రియమణి
వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.