News December 12, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA
AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
Similar News
News January 13, 2025
నచ్చకపోతే కోహ్లీ అవకాశాలు ఇవ్వడు: ఉతప్ప
జట్టులో ఎవరైనా నచ్చకపోతే విరాట్ కోహ్లీ అవకాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాడని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్రపంచ కప్‌కి అంబటి రాయుడు ఎంపిక కాలేదని, కోహ్లీకి అతనంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వరల్డ్ కప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన తరువాత కూడా జట్టులోకి తీసుకోలేదన్నారు. ఒకర్ని ఇంటికి పిలిచి మొహం మీద తలుపులు వేయడం తగదని ఉతప్ప వ్యాఖ్యానించారు.
News January 13, 2025
‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు
‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News January 13, 2025
నారావారిపల్లెలో సీఎం బిజీబిజీ
AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.