News October 6, 2024
ఇవాళ, రేపు వర్షాలు

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News November 21, 2025
మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ నేపథ్యం

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా డా.శబరీష్ నియామకమైన విషయం తెలిసిందే. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు జిల్లా ఎస్పీకు బదిలీ అయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శబరీశ్ 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు
* ఫిక్స్ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి


