News October 6, 2024
ఇవాళ, రేపు వర్షాలు

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 18, 2026
25న తిరుమలలో రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమలలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది.
News January 18, 2026
మూడో వన్డే.. న్యూజిలాండ్ భారీ స్కోరు

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓ దశలో NZ 58 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోగా మిచెల్-ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సిరాజ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ తలో 3, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.
News January 18, 2026
ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.


