News November 4, 2024

రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలమట్టం

image

TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్‌లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్‌నగర్‌లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.

Similar News

News December 13, 2024

బాబోయ్ చలి.. IMD ఆరెంజ్ అలర్ట్

image

TG: రాష్ట్రంలో చలి విషయంలో ఈ ఏడాది తొలి ఆరెంజ్ అలర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) జారీ చేసింది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధం కావాలని సూచించింది. పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. ‘ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో బాగా ప్రభావం ఉండొచ్చు. ఈ నెల 15 వరకు హైదరాబాద్ మేఘావృతమై ఉంటుంది’ అని పేర్కొంది.

News December 13, 2024

అల్లు అర్జున్ అరెస్ట్ పబ్లిసిటీ స్టంట్: కేంద్ర మంత్రి

image

క్రియేటివ్ ఇండస్ట్రీ అంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని, ఈ విషయాన్ని అల్లు అర్జున్ అరెస్ట్ మరోసారి నిరూపించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు TG ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆ నిందను పోగొట్టేందుకు ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని ఆరోపించారు. TG ప్రభుత్వం సినీ ప్రముఖులపై దాడులు చేసే బదులు బాధితులను ఆదుకోవాలని, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని శిక్షించాలన్నారు.

News December 13, 2024

రేపటి నుంచే మూడో టెస్ట్.. షెడ్యూల్ ఇదే

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి గబ్బాలో BGT మూడో టెస్ట్ జరగనుంది. 5.50am-7.50am ఫస్ట్ సెషన్, 8.30am-10.30am సెకండ్ సెషన్, 10.50am-12.50 pm థర్డ్ సెషన్ జరుగుతుంది. భారత జట్టులో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్, అశ్విన్ ప్లేస్‌లో సుందర్ ఆడే ఛాన్సుంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. అటు AUSలో బొలాండ్ స్థానంలో హెజిల్‌వుడ్ ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు .