News August 29, 2024
మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లకు పెంపు.. సత్ఫలితాలపై ఎన్నో ఆశలు

మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచడం ద్వారా వారు జీవితంలో రాణించడానికి ఆస్కారం కల్పించవచ్చని హిమాచల్ ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం 2006లో పార్లమెంటు చేసిన PCM చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సవరించింది. చిన్న వయసులోనే పెళ్లి వల్ల వారి చదువు ఆగిపోతుందని, అలాగే తల్లికావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని HP ప్రభుత్వం పేర్కొంది. కనీస వివాహ వయసుపై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News July 10, 2025
నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క శెట్టి

తాను ఆరో తరగతిలోనే సహ విద్యార్థితో ప్రేమలో పడిపోయినట్లు హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపారు. తన ఫస్ట్ లవ్ విషయాన్ని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ రోజు నా క్లాస్‌మేట్ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. నేను కూడా అతడికి ఓకే చెప్పా. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ విషయం ఇప్పటికీ నాకు ఓ మధురానుభూతి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అనుష్క నటించిన ‘ఘాటీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
News July 10, 2025
ట్రంప్‌పై డ్రోన్ దాడి జరగొచ్చు: ఇరాన్ అధికారి

ట్రంప్‌పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజనీ హెచ్చరించారు. సన్‌బాత్ చేసే సమయంలో డ్రోన్‌తో అటాక్ చేయొచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని నివాసం కూడా ట్రంప్‌కు సురక్షితం కాకపోవచ్చని చెప్పారు. 2020లో ఇరాన్ ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హత్యలో ట్రంప్ పాత్రను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చీఫ్ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నా ప్రతీకారం తప్పదన్నారు.
News July 10, 2025
ఆర్టీసీలో 422 కొత్త బస్సులు

TG: ఆర్టీసీ కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టనుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లు, 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్‌లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది. 13-15లక్షల కి.మీ. తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.