News October 27, 2024
రాజ్ పాకాల పరారీలో ఉన్నారు: ఎక్సైజ్ సీఐ
TG: జన్వాడలో ఫామ్‌హౌస్ పార్టీపై ఎక్సైజ్ సీఐ శ్రీలత స్పందించారు. ‘నిబంధనలు ఉల్లంఘించి పార్టీ నిర్వహించారు. ఏ1గా ఫామ్‌హౌస్ సూపర్‌వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చాం. కర్ణాటక లిక్కర్‌తో పాటు 7 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నాం. రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నాం’ అని ఆమె వెల్లడించారు.
Similar News
News November 11, 2024
ఆ డొమైన్ ఫ్రీగా ఇస్తాం: దుబాయ్ యూట్యూబర్లు
JioHotstar డొమైన్‌ను ఢిల్లీ యాప్ డెవలపర్ నుంచి దుబాయ్‌కు చెందిన ఇద్దరు యూట్యూబర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సైట్‌ను రిలయన్స్‌కు ఇవ్వాలంటే రూ.కోటి చెల్లించాలని గతంలో వీరు డిమాండ్ చేశారు. అయితే, తాజాగా ఫ్రీగా ఇస్తామంటూ ట్విస్ట్ ఇచ్చారు. jiohotstar.com డొమైన్ వారి దగ్గర ఉండటమే ఉత్తమమని భావిస్తున్నామని, అందుకే ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వారు కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చారు.
News November 11, 2024
మరోసారి థియేటర్లలోకి ‘పుష్ప’ పార్ట్-1
‘పుష్ప’ పార్ట్-1ను USAలో ఈనెల 19న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. పార్ట్-1ను ఇండియాలో కూడా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘పుష్ప2-ది రూల్’ వచ్చే నెల 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News November 11, 2024
తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
* GHMC కమిషనర్ -ఇలంబరితి
* టూరిజం, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి -స్మిత
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ -సృజన
* ఇంటర్ బోర్డు కార్యదర్శి -కృష్ణ ఆదిత్య
* BC సంక్షేమ శాఖ కార్యదర్శి -ఇ.శ్రీధర్
* మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి -అనితా రామచంద్రన్
* రవాణా శాఖ కమిషనర్ -సురేంద్ర మోహన్
* ఎక్సైజ్ శాఖ డైరెక్టర్- హరికిరణ్
* ట్రాన్స్ కో CMD-కృష్ణ భాస్కర్