News March 9, 2025
రాజమౌళి-మహేశ్ బాబు సినిమా క్లిప్ లీక్!

రాజమౌళి-మహేశ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అందులో మహేశ్ బాబుతో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంత ప్రతిష్ఠాత్మక సినిమాకు లీకుల బెడద ఏంటని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూవీ టీమ్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
*గైడ్‌లైన్స్ ప్రకారం లీకైన క్లిప్ ఇక్కడ చూపించట్లేదు.
Similar News
News March 23, 2025
IPL చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్

IPL-2025లో RR బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇవాళ ఉప్పల్‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మారారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో తీక్షణ(52), సందీప్ శర్మ(51) ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్‌గానూ రికార్డ్ సృష్టించింది.
News March 23, 2025
హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.
News March 23, 2025
ఆస్పత్రిలో చేరిన అల్లు అర్జున్ నాయనమ్మ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం (95) ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కాగా కనకరత్నం గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అన్న విషయం తెలిసిందే.