News August 24, 2024
హైదరాబాద్‌లో ‘రాజాసాబ్’ షూటింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. షూటింగ్ సెట్‌లో ప్రభాస్ నీడ ఉన్న ఫొటోను కొందరు అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. దీనికోసం 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Similar News
News September 19, 2024
భారత్‌కు మెడల్స్ సాధించడమే లక్ష్యం: మనూ భాకర్
భారత్‌కు మరెన్నో మెడల్స్ సాధించిపెట్టడమే తన ఏకైక లక్ష్యమని ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ తెలిపారు. ఎన్డీటీవీ యువ కాంక్లేవ్‌లో ఆమె పాల్గొన్నారు. ‘షూటింగే నా జీవితం. ఇంకేమీ ఊహించుకోలేను. లైఫ్‌లో వీలైనంత ఎక్కువ కాలం షూటింగ్‌లో ఉంటూ ఇండియాకు మెడల్స్ సాధిస్తా’ అని పేర్కొన్నారు. ఆగ్రహం వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు.. కోపాన్ని ఏదైనా మంచిపని మీదకు మళ్లిస్తానని, క్రీడాకారులకు అది కీలకమని ఆమె వివరించారు.
News September 19, 2024
నీ పని ఇదేనా రేవంతు?: TBJP
TG: CM రేవంత్‌రెడ్డిపై X వేదికగా రాష్ట్ర BJP విమర్శలు గుప్పించింది. ‘నీ పని ఢిల్లీకి సూట్‌కేసులు మోయడమా?, గాంధీ కుటుంబానికి భజన చేయడమా?, తెలంగాణేతరులకు ఉద్యోగాలివ్వడమా?, సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు పెట్టడమా?, బూతులు తిట్టడమా?, నీ సోదరులకు కంపెనీలు పెట్టివ్వడమా?, నీ సొంత కంపెనీలకు ప్రాజెక్టులిప్పించడమా?, పేదల ఇండ్లు కూల్చి ఒవైసీ, తిరుపతిరెడ్డి బంగ్లాలు కాపాడటమా?’ అని ట్వీట్ చేసింది.
News September 19, 2024
రవిచంద్రన్ అశ్విన్.. ది ఆల్‌రౌండర్!
చెన్నై టెస్టులో సెంచరీతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజమైన ఆల్‌రౌండర్ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. బౌలర్‌గా 500 వికెట్లు, బ్యాటర్‌గా పలు సెంచరీలు, యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, చెస్ ఆటగాడు, ట్విటర్ ట్రోలర్, నాన్-స్ట్రైకర్ రన్ ఔట్ స్పెషలిస్ట్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు 102 రన్స్ చేసిన ఆయన రేపు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేయాలని విష్ చేస్తున్నారు.