News April 24, 2024

రాజస్థాన్ ‘రాజసం’

image

IPL: రాజస్థాన్ దూసుకెళ్తోంది. 8 మ్యాచుల్లో 7 విజయాలతో ప్లేఆఫ్స్ రేసుకు దగ్గరైంది. ఆ టీమ్ భీకర ఆటగాళ్లతో ప్రమాదకరంగా కనిపిస్తోంది. యశస్వి సైతం సెంచరీతో ఫామ్ అందుకున్నారు. బట్లర్, శాంసన్, పరాగ్, హెట్మైర్, పావెల్ లాంటి హిట్టర్లు.. బౌల్ట్, చాహల్, అశ్విన్ లాంటి అనుభవమున్న బౌలర్లు ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే టైటిల్ సులభంగా సాధిస్తారని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

Similar News

News February 7, 2026

సంగారెడ్డి: GOOD NEWS.. 11న సెలవు

image

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థల భవనాలకు ఈనెల 12, 13 తేదీల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

News February 7, 2026

ట్రేడ్ డీల్.. మన రైతుకు రక్షణ!

image

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో పలు వ్యవసాయ ఉత్పత్తులను మినహాయించారు. US నుంచి ఎగుమతయ్యే మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్(ఫ్యూయల్), పొగాకు, పలు కూరగాయలు, మాంసంపై గతంలో ఉన్న రూల్స్ కొనసాగుతాయి. వీటిపై టారిఫ్ డిస్కౌంట్స్ ఉండవు. US వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే భారత రైతులపై పెను ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో వ్యవసాయ, పాల ఉత్పత్తులను డీల్‌లో చేర్చలేదు.

News February 7, 2026

వెనక్కి తగ్గిన ‘జన నాయగన్’ టీమ్?

image

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 9న రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే CBFC సూచనల మేరకు పలు మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 19 లేదా 20న సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు