News April 24, 2024
రాజస్థాన్ ‘రాజసం’
IPL: రాజస్థాన్ దూసుకెళ్తోంది. 8 మ్యాచుల్లో 7 విజయాలతో ప్లేఆఫ్స్ రేసుకు దగ్గరైంది. ఆ టీమ్ భీకర ఆటగాళ్లతో ప్రమాదకరంగా కనిపిస్తోంది. యశస్వి సైతం సెంచరీతో ఫామ్ అందుకున్నారు. బట్లర్, శాంసన్, పరాగ్, హెట్మైర్, పావెల్ లాంటి హిట్టర్లు.. బౌల్ట్, చాహల్, అశ్విన్ లాంటి అనుభవమున్న బౌలర్లు ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే టైటిల్ సులభంగా సాధిస్తారని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.
Similar News
News January 16, 2025
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో సంఘం ఛైర్మన్‌ను నియమించనుంది. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 JAN 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. అటు స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.3,985 కోట్లతో మూడో స్పేస్ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయనుంది.
News January 16, 2025
2 నెలల్లో ఉచిత బస్సు పథకం: మంత్రి మండిపల్లి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో AP దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. తిరుపతి(D)లోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News January 16, 2025
KTR.. ‘గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నావ్: సామ
ఫార్ములా కేసులో KTR అవినీతి స్పష్టంగా కన్పిస్తోందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఫార్ములా-e వారికి HMDA (గ్రీన్ కో తరపున) డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. నష్టాల వల్లే గ్రీన్ కో తప్పుకుందన్న KTR.. ఫార్ములా-eకి మొదటి సీజన్ డబ్బు కట్టలేదనే విషయం మాత్రం ఎందుకు దాచారని ప్రశ్నించారు. గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.