News February 22, 2025
వెట్రిమారన్ డైరెక్షన్లో రజినీకాంత్ మూవీ?

రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కూలీ’ చిత్రీకరణ చివరి దశలో ఉండగానే జైలర్-2ను ప్రకటించారు. తాజాగా విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ సూపర్ స్టార్‌కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. అయితే రజినీ తుది నిర్ణయం తీసుకోలేదని, పూర్తి స్క్రిప్ట్‌తో మరోసారి చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్.
Similar News
News November 24, 2025
బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<


