News February 22, 2025

వెట్రిమారన్ డైరెక్షన్‌లో రజినీకాంత్ మూవీ?

image

రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కూలీ’ చిత్రీకరణ చివరి దశలో ఉండగానే జైలర్-2ను ప్రకటించారు. తాజాగా విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ సూపర్ స్టార్‌కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. అయితే రజినీ తుది నిర్ణయం తీసుకోలేదని, పూర్తి స్క్రిప్ట్‌తో మరోసారి చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

Similar News

News March 25, 2025

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే: భారత ప్రతినిధి

image

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్‌కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. UNOలో పాక్ అనవసరంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకొస్తోందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్‌‌కే చెందుతుందని అన్నారు. UNO శాంతి పరిరక్షణ చర్చలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రతినిధి లేవనెత్తగా భారత్ దీటుగా బదులిచ్చింది.

News March 25, 2025

‘ఆస్కార్’ గెలుపొందిన దర్శకుడిపై దాడి

image

‘ఆస్కార్’ గ్రహీత, పాలస్తీనా దర్శకుడు హందాన్ బల్లాల్‌పై వెస్ట్ బ్యాంక్‌లో దాడి జరిగింది. తొలుత సెటిలర్లు దాడి చేయగా ఆ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. హందాన్‌కు తల, కడుపుపై గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు. అయితే అతడి అరెస్టుపై ఇజ్రాయెల్ బలగాలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ‘నో అదర్ ల్యాండ్’ పేరిట పాలస్తీనాపై హందాన్, అతడి టీమ్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది.

News March 25, 2025

‘గూగుల్’ గురించి ఈ విషయం తెలుసా?

image

‘గూగుల్’ కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం అమలు చేస్తోన్న ఓ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50శాతం శాలరీని ఇస్తోంది. అలాగే వారి పిల్లల్లో ప్రతి ఒక్కరికీ 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు $1,000 (రూ.84వేలు) అందిస్తోంది. ఉద్యోగి కుటుంబం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కంపెనీ అండగా నిలవడం గ్రేట్ అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మీరేమంటారు?

error: Content is protected !!