News September 16, 2024

రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలిస్తాం: KTR

image

TG: సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడంపై KTR మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్ తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నట్లు చెప్పారు.

Similar News

News December 21, 2024

జనవరి 2న క్యాబినెట్ భేటీ

image

AP: జనవరి 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు విషయాలపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి పనులపై చర్చిస్తుందని సమాచారం.

News December 21, 2024

RGV ‘వ్యూహం’ మూవీకి నోటీసులు

image

డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీకి AP ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్‌లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు లబ్ధి పొందడంతో RGVతోపాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బును వెనక్కి కట్టాలని ఆదేశించింది. కాగా ఫైబర్ నెట్‌లో వ్యూహం సినిమాకు 1,816 వ్యూస్ రాగా అప్పటి ప్రభుత్వం రూ.1.15 కోట్లు చెల్లించిందని ఫైబర్ గ్రిడ్ ఆరోపించింది.

News December 21, 2024

ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి: పవన్ కళ్యాణ్

image

AP: తాను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్లిపోనని, 5ఏళ్లు పని చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి (D) బల్లగరువులో పర్యటించిన ఆయన 100 కి.మీ. మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇంతకు ముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదని, కానీ 100 మంది ఉన్నా రోడ్డు వేయాలని PM మోదీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు.