News September 16, 2024
రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలిస్తాం: KTR
TG: సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడంపై KTR మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్ తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News October 16, 2024
త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు?
AP: మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా నేటి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.
News October 16, 2024
నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.
News October 16, 2024
నేడు క్యాబినెట్ భేటీ.. కొత్త పాలసీలపై చర్చ
AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదారు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి, ఆమోదించే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు10% ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నారు.