News March 16, 2025
రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.
Similar News
News April 12, 2026
చేపను ఇవ్వడం కాదు పట్టడం నేర్పాలి.. ఏమంటారు?

దేశంలో ఉచిత పథకాల వల్ల ప్రజలు బద్ధకస్థులు అవుతున్నారని, వాటిని రద్దు చేయాలని కొంతమంది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అదే మాట చెప్పారు. ‘ప్రభుత్వం ఉచితాలు రద్దు చేసి విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేసినప్పుడు వాటి బడ్జెట్ ఎంత? ఎలా నిధులు సమకూరుస్తారు? అని ప్రజలు అడగాలి’ అని ఓ కార్యక్రమంలో అన్నారు.
News April 12, 2026
11AMకు ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిజల్ట్స్ ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఉ.11 గం.కు ప్రభుత్వ సలహాదారు K.కేశవరావు ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. Way2Newsలో అత్యంత వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎలాంటి యాడ్స్ లేకుండా క్షణాల్లో మార్కులు వచ్చేస్తాయి. వాటిని ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.
News April 12, 2026
మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి.


