News February 13, 2025
వక్ఫ్ బిల్లుపై JPC నివేదికకు రాజ్యసభ ఆమోదం

వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC) నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం JPC ఇటీవల సవరణ బిల్లు నివేదికను ఆమోదించింది. కాగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఇది ముస్లింల హక్కులపై దాడేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Similar News
News November 22, 2025
‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ ఛానల్పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.
News November 22, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.
News November 22, 2025
భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.


