News February 13, 2025
వక్ఫ్ బిల్లుపై JPC నివేదికకు రాజ్యసభ ఆమోదం

వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC) నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం JPC ఇటీవల సవరణ బిల్లు నివేదికను ఆమోదించింది. కాగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఇది ముస్లింల హక్కులపై దాడేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Similar News
News March 26, 2025
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.
News March 26, 2025
శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.