News August 13, 2025

ఆర్టీసీకి భలే గి‘రాఖీ’

image

TG: రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC బస్సుల్లో 6 రోజుల్లో (ఆగస్టు 7-12) 3.68 కోట్ల మంది ప్రయాణించారని TGSRTC వెల్లడించింది. ఇందులో 2.51 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపింది. పండుగ రోజున (AUG 9) 45.62 లక్షల మంది ప్రయాణించగా, ఈ నెల 11న అత్యధికంగా 45.94L మంది మహిళలతో సహా మొత్తం 68.45L మంది రాకపోకలు సాగించారని పేర్కొంది. ఒక్క రోజులో ఇంత మంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని వివరించింది.

Similar News

News August 13, 2025

సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

image

AP: వైసీపీ నేత, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారని యర్రగుంట్ల పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నిడిజువ్విలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు యర్రగుంట్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు.

News August 13, 2025

NEET (UG) కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల భర్తీకి చేపట్టిన NEET (UG) కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. అలాట్‌మెంట్ లెటర్‌ను MCC వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. సీట్ అలాట్‌మెంట్ లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 13, 2025

‘కూలీ’ సినిమాను ఎంజాయ్ చేశా: ఉదయనిధి

image

రేపు విడుదల కానున్న రజినీకాంత్ ‘కూలీ’ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు అభినందనలు. ఈ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశా. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.