News August 17, 2024
ఈ సమయంలో రాఖీ కట్టకూడదు!

ఆగస్టు 19న (సోమవారం) రాఖీ పండుగ జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి ఆ రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు ప్రారంభమై రా.11.55 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ మధ్యలో భద్రకాలం ఉ.5.53 నుంచి మ.1.32 గంటల వరకు ఉంటుందని, శాస్త్ర ప్రకారం భద్రకాలంలో సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. అది ముగిశాకే మ.1.33 గంటల నుంచి రా.9.08 గంటల వరకు శుభ సమయంలో కట్టాలని సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News November 28, 2025
గట్టుప్పల్: అక్కడ ఓటు వేయాలంటే.. 3 కిలోమీటర్లు నడవాల్సిందే!

గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లకు ఓటు వేసేందుకు తిప్పలు తప్పడం లేదు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని రంగంతండా, అజనాతండా, దేవులతండా, రాగ్యాతండాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. సుమారు 3 కి.మీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
News November 28, 2025
అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.


