News August 20, 2024

హత్యాచారానికి నిరసనగా ర్యాలీ.. 33 మందికి నోటీసులు

image

AP: కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా IMA పిలుపు మేరకు ర్యాలీ, ధర్నా చేసిన 33 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు అధికారులు షోకాజ్ నోటీసులిచ్చారు. అల్లూరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొనడంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని DMHO జమాల్ బాషా పేర్కొన్నారు. ఈ నోటీసులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 24, 2025

జనవరి 24: చరిత్రలో ఈరోజు

image

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్‌ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం

News January 24, 2025

భారతీయులకు బిగ్ రిలీఫ్

image

అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లైంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్‌ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్‌తో పాటు USAకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే.

News January 24, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.