News July 11, 2024
ఉత్తమ నటులుగా రామ్‌చరణ్, ఎన్టీఆర్

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023లో RRR సినిమాకు అవార్డుల పంట పండింది. తెలుగులో బెస్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమా ఎంపికయింది. ఉత్తమ నటులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్, బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళిని అవార్డులు వరించాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ పురస్కారం దక్కించుకున్నారు.
Similar News
News February 12, 2025
RTC బస్సు ఢీకొని మహిళ మృతి.. రూ.9 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశం

USలో ఉద్యోగం చేసే లక్ష్మీ 2009లో INDకు వచ్చి ఫ్యామిలీతో కలిసి కారులో రాజమండ్రి వెళ్తుండగా APSRTC బస్సు ఢీకొట్టింది. లక్ష్మీ మృతి చెందడంతో RTC నుంచి రూ.9Cr పరిహారం ఇప్పించాలని ఆమె భర్త శ్యాం మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ట్రిబ్యునల్ రూ.8.05Cr చెల్లించాలని చెప్పింది. అయితే RTC HCకి వెళ్లగా రూ.5.75Crకు తగ్గించింది. దీన్ని శ్యాం SCలో సవాల్ చేయగా రూ.9Cr చెల్లించాలని తాజాగా ఆదేశించింది.
News February 12, 2025
Good News: తగ్గిన రిటైల్ ఇన్‌ఫ్లేషన్

భారత రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5 నెలల కనిష్ఠానికి చేరుకుంది. డిసెంబర్లోని 5.22 నుంచి జనవరిలో 4.31 శాతానికి తగ్గింది. కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇక రూరల్ ఇన్‌ఫ్లేషన్ 5.76 నుంచి 4.64, అర్బన్ ఇన్‌ఫ్లేషన్ 4.58 నుంచి 3.87 శాతానికి తగ్గాయి. ధరలు తగ్గడంతో RBI మరోసారి వడ్డీరేట్ల కోత చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపోరేటును 6.25 నుంచి 6 శాతానికి తగ్గించొచ్చని భావిస్తున్నారు.
News February 12, 2025
ఏ సినిమాకు వెళ్తున్నారు?

ఈ వారం కొత్త సినిమాల కంటే పాత సినిమాల హవానే ఎక్కువగా ఉంది. వాలంటైన్స్ డే కావడంతో పలు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈనెల 14న విశ్వక్‌సేన్ ‘లైలా’, బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్ కానున్నాయి. ఇక అదేరోజున రామ్ చరణ్ ‘ఆరెంజ్’, సూర్య ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో రిలీజ్ కానున్నాయి.