News April 7, 2024
ఏనుగుకు స్నానం చేయించిన రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఏనుగు రెస్క్యూ క్యాంపులో సందడి చేశారు. క్లీంకారతో కలిసి వారు చిన్న ఏనుగుకు స్నానం చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు చరణ్‌కు ధన్యవాదాలు’ అని ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
Similar News
News November 12, 2024
మా అబ్బాయి రికార్డుల కోసం చూడడు: శాంసన్ తండ్రి
తన కుమారుడు జట్టు కోసమే తప్ప వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించడని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘సంజూ వరస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లూ తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడతారు. సంజూ ఎప్పుడూ అలా ఆడడు’ అని స్పష్టం చేశారు.
News November 12, 2024
19న OTTలోకి థ్రిల్లర్ మూవీ
మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది.
News November 12, 2024
కలెక్టర్‌పై దాడి చేయడమేంటి?
జిల్లా అధికార యంత్రాంగానికి బాస్ కలెక్టర్. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసేది ఆయనే. నిన్న వికారాబాద్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యూరోక్రాట్లపై దాడి చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అధికారులు ఫీల్డులో ధైర్యంగా పని చేయలేరని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?