News May 10, 2024

రేపు పిఠాపురానికి రామ్ చరణ్

image

AP: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి రేపు పిఠాపురం వెళ్లనున్నారు. ఉ.9.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న వారు అక్కడి నుంచి పిఠాపురం వెళ్తారు. అనంతరం స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరోవైపు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచార గడవు ముగియనుండటంతో బాబాయ్ పవన్ కళ్యాణ్ తరఫున అబ్బాయ్ ఏమైనా ప్రచారం నిర్వహిస్తారా? లేదా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

Similar News

News November 17, 2025

3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ఐబీపీఎస్ <>RRB<<>> పీవో ప్రిలిమ్స్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. RRB పీవో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు www.ibps.in/ సైట్లో రిజిస్ట్రేషన్, రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,928 పోస్టులకు ఈ నెల 22,23 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

News November 17, 2025

ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (<>NIELIT<<>>) 4 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, BE, B.Tech, M.Tech, MSc, CA, CMA/B.Com, M.Com ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు . దరఖాస్తు ఫీజు రూ.200. ఈ నెల 26న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nielit.gov.in/

News November 17, 2025

వేదాల పరమార్థం ఏంటంటే..?

image

వేదాలు ఆశీర్వచనం కోసమో, భుక్తి కోసమో ఉన్నాయనుకుంటే పొరపాటే! వీటి పరమార్థం దివ్యమైనది. ఇవి లోక శ్రేయస్సు కోసం ఉద్భవించాయి. సమాజం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి వేదాలలో ఎన్నో ప్రత్యేక కర్మ ప్రక్రియలున్నాయి. మానవుల కోరికలు తీరాలన్నా, జీవితంలో ఫలితాలు సిద్ధించాలన్నా వేదాలలో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. నిష్ఠతో ఆ కర్మలను ఆచరిస్తే అనుకున్నది జరుగుతుంది. <<-se>>#VedikVibes<<>>