News May 10, 2024
రేపు పిఠాపురానికి రామ్ చరణ్

AP: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి రేపు పిఠాపురం వెళ్లనున్నారు. ఉ.9.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న వారు అక్కడి నుంచి పిఠాపురం వెళ్తారు. అనంతరం స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరోవైపు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచార గడవు ముగియనుండటంతో బాబాయ్ పవన్ కళ్యాణ్ తరఫున అబ్బాయ్ ఏమైనా ప్రచారం నిర్వహిస్తారా? లేదా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
Similar News
News February 10, 2025
5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News February 10, 2025
ప్రశాంతమైన జీవితానికి 8 సూత్రాలు

– ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు
– ఎక్కువ గమనించు
– తక్కువ మాట్లాడు
– ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు
– నేర్చుకోవడం మానేయకు
– ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకో
– ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు
– ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకో
News February 10, 2025
13 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా POTM అవార్డు అందుకున్న ప్లేయర్‌గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్‌లో అయినా హిట్‌మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్‌పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.