News November 12, 2024
ట్రంప్ పాలకవర్గంలో రామస్వామికి కీలక బాధ్యతలు?

ట్రంప్ US అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆయన పాలకవర్గంలో ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు హోంల్యాండ్ సెక్యూరిటీ&ఇమ్మిగ్రేషన్ పాలసీని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వివేక్ చాలా తెలివైనవాడంటూ ప్రశంసించిన ట్రంప్ అతడి స్థానం ఏంటో ఇప్పుడే చెప్పలేనన్నారు.
Similar News
News December 2, 2025
భారత్‌పై పాక్ మీడియా అసత్య ప్రచారం

తుఫానుతో నష్టపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు గగనతల అనుమతులివ్వాలని సోమవారం 1PMకు పాక్ కోరగా 4గంటల్లోనే IND ఒప్పుకుంది. అయితే పర్మిషన్ ఇవ్వలేదని పాక్ మీడియా ప్రచారం చేయడాన్ని భారత్ ఖండించింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని, PAK మీడియా నివేదికలు బాధ్యత రాహిత్యమైనవని పేర్కొంది. గగనతల అనుమతుల విషయంలో సాంకేతిక, భద్రతా అంచనాలనే IND పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో నిరాకరణ ఉండదని చెప్పింది.
News December 2, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

☛ HYD ఓల్డ్ సిటీతో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
☛ మహిళల భద్రత, సామాజిక సాధికారతలో భాగంగా 20 మంది ట్రాన్స్జెండర్లను HYD మెట్రో సెక్యూరిటీలో సిబ్బందిగా నియమించినట్లు CMO అధికారి జాకబ్ రోస్ ట్వీట్.
☛ రాష్ట్రంలో 2 నెలల్లో AI యూనివర్సిటీ సేవలు. లీడింగ్ గ్లోబల్ యూనివర్సిటీల సహాకారంతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.
News December 2, 2025
నితీశ్‌ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు: అశ్విన్

రాంచీ వన్డేకు ఆల్‌రౌండర్ నితీశ్‌ను సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హార్దిక్ లేని టైంలో నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్షన్ టీంను ప్రశ్నించారు. జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. హార్దిక్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలరని, అవకాశాలిస్తే మెరుగవుతారన్నారు. ఇలా జరగలేదంటే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.


