News November 12, 2024

ట్రంప్ పాలకవర్గంలో రామస్వామికి కీలక బాధ్యతలు?

image

ట్రంప్ US అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆయన పాలకవర్గంలో ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు హోంల్యాండ్ సెక్యూరిటీ&ఇమ్మిగ్రేషన్ పాలసీని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వివేక్ చాలా తెలివైనవాడంటూ ప్రశంసించిన ట్రంప్ అతడి స్థానం ఏంటో ఇప్పుడే చెప్పలేనన్నారు.

Similar News

News November 11, 2025

రాజమౌళి సర్‌ప్రైజ్‌లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ

image

మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను రాజమౌళి వరుస సర్‌ప్రైజ్‌లతో ముంచెత్తుతున్నారు. ఈ నెలలో SSMB29 నుంచి కేవలం టైటిల్ గ్లింప్స్, లుక్ రిలీజ్ చేస్తారని భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా పృథ్వీరాజ్ లుక్, ఓ <<18251735>>సాంగ్‌<<>>ను రిలీజ్ చేశారు. త్వరలో ప్రియాంక లుక్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. అటు ఈ నెల 15న టైటిల్‌తో పాటు 3 నిమిషాల గ్లింప్స్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అప్డేట్లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News November 11, 2025

ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదంటే?

image

త్రివిధ తాపాల్లో దైవిక తాపం ఒకటి. ఇది ప్రకృతి శక్తుల వలన సంభవిస్తుంది. అధిక వర్షాలు, కరవు, భూకంపాలు, పిడుగులు, తుఫానులు, గ్రహాచారాల వలన కలిగే బాధలు దీని కిందకి వస్తాయి. ఈ దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి దైవారాధన, భక్తి, ప్రకృతి పట్ల మనం గౌరవం చూపాలి. యజ్ఞాలు, దానాలు, పవిత్ర నదీ స్నానాలు వంటి ధార్మిక కర్మలను ఆచరించాలి. విధిని అంగీకరించాలి. తద్వారా ఈ దైవిక దుఃఖాలను తట్టుకునే మానసిక శక్తి లభిస్తుంది.

News November 11, 2025

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS, లాస్కర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indiancoastguard.gov.in/