News September 26, 2024

రామాయణం పాఠ్యపుస్తకాల్లో ఉండాలి: వెంకయ్య నాయుడు

image

AP: రామాయణ స్ఫూర్తిని భావితరాలకు అందించడం సంతోషంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేయాల్సిన అవసరముందని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు సెక్యులర్ పేరు చెబుతున్నారని విమర్శించారు.

Similar News

News October 10, 2024

రతన్ టాటా పేరు చరిత్రలో నిలిచిపోతుంది: పవన్

image

AP: రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి అని, ఆయన పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని Dy.CM పవన్ కళ్యాణ్ కొనియాడారు. టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు. ఉప్పు నుంచి విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా పేరు ప్రతిధ్వనించేలా చేశారని తెలిపారు. టాటా అంటే పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజసేవ చేశారని పవన్ ట్వీట్ చేశారు.

News October 10, 2024

శాంతి, స్థిరత్వంపై ASEAN దేశాలతో చర్చిస్తా: మోదీ

image

ASEAN దేశాలతో భారత్ బంధం మరింత బలపడుతుందని PM మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కోఆపరేషన్ ఫ్యూచర్ దిశ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అక్కడి లీడర్లతో చర్చిస్తానని చెప్పారు. ASEAN-India, ఈస్ట్ ఏషియా సదస్సుల కోసం ఉదయం ఆయన లావోస్ బయల్దేరారు. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఈస్ట్ ఏషియా సదస్సు మంచి అవకాశం. లావో PDR నేతలను కలుస్తాను’ అని మోదీ తెలిపారు.

News October 10, 2024

దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది. నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది. కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.