News April 12, 2024
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ప్రధాన నిందితుడు అరెస్ట్

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత అతడు అస్సాం, పశ్చిమబెంగాల్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News April 19, 2026
గద్వాల: పట్టుదలే ఆయుధం.. ఒకేసారి నాలుగు కొలువులు

పట్టుదలతో శ్రమిస్తే విజయం వరిస్తుందని గద్వాల జిల్లా బొంకూరుకు చెందిన ఉన్నతి నిరూపించారు. ఒకే ఏడాదిలో ఆమె ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటారు. గ్రామీణ బ్యాంకు పీఓ, కెనరా బ్యాంకు పీఓ, న్యూఇండియా ఇన్సూరెన్స్ ఏఓతో పాటు కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాన్ని సాధించారు. మట్టిబిడ్డ ప్రతిభను గుర్తించి గ్రామస్థులు ఘనంగా అభినందించారు.
News April 19, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 19, 2026
MMTS రైళ్లలో ఫ్రీ జర్నీ.. జూన్ 2 నుంచి అమలు?

TG: HYDలో ట్రాఫిక్, పొల్యూషన్‌కు చెక్ పెట్టేందుకు MMTS రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని JUNE 2 నుంచి ఏడాదిపాటు అమలు చేయాలని భావిస్తోంది. ఫలితాన్ని బట్టి ఆ తర్వాత కొనసాగించే ఛాన్సుంది. ఈ మేరకు ద.మ.రైల్వేకు లేఖ రాసింది. MMTS రైళ్ల ద్వారా రైల్వేకి ఏడాదికి సుమారు ₹10Cr ఆదాయం వస్తుండగా, దానిని తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం.


