News May 23, 2024
రామేశ్వరం కేఫ్‌లో పాడైన పదార్థాలు

HYDలోని రామేశ్వరం కేఫ్ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంలా తయారైంది. ఆ కేఫ్‌లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయారు. ఈ తనిఖీల్లో గడువు తీరిన 100 కిలోల మినప పప్పు, 10 లీటర్ల పెరుగు, 8లీ. పాలు వంటి వాటిని గుర్తించారు. అలాగే లేబుల్స్ లేని పలు పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని, వంటగది చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు పలు ఫొటోలు విడుదల చేశారు.
Similar News
News April 17, 2026
హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్

క్రూడ్ ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచానికి ఇరాన్ ఊరటనిచ్చింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ట్వీట్ చేశారు. లెబనాన్‌తో ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీజ్‌ఫైర్ అమలులో ఉన్నంత <<19668983>>కాలం<<>> (మరో 9 రోజులు) జలసంధి తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనతో ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి.
News April 17, 2026
ఆ తప్పులు సరిదిద్దేందుకే డీలిమిటేషన్: షా

దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని కేంద్రమంత్రి అమిత్ షా LSలో అన్నారు. ‘ఒక దగ్గర 38 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో చోట 6 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల ఇలాంటి తప్పులను సరిదిద్దవచ్చు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్ ఆపింది. జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌ను మేం లింక్ చేయలేదు. కాంగ్రెస్సే చేసింది’ అని స్పష్టంచేశారు.
News April 17, 2026
దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


