News July 28, 2024

ఫైనల్‌కు దూసుకెళ్లిన రమిత

image

ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ రమితా జిందాల్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 5వ స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. ఇదే విభాగంలో ఎలవెనిల్ వలరివన్ 10వ స్థానంలో నిలవడంతో ఫైనల్లో అడుగు పెట్టలేకపోయారు. టాప్-8లో స్థానం సాధించిన వారు మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు.

Similar News

News October 11, 2024

ఇ-కామర్స్ కంపెనీల dark patternsపై కేంద్రం స్క్రూటినీ

image

ఫెస్టివ్ సీజన్లో ఇ-కామర్స్ కంపెనీలు డార్క్ ప్యాటర్న్ రూల్స్ పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైంది. యూజర్ల ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు త్వరగా కొనేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఇంకా 2 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి, మరికాసేపట్లో ఈ వస్తువుపై డిస్కౌంట్ ఉండదని ఫ్లాష్ చేస్తుంటాయి. ఇవన్నీ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి.

News October 11, 2024

మందు బాబులపై ‘రౌండాఫ్’ భారం

image

AP: నూతన లిక్కర్ పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీల వసూలుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ విధానంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉదాహరణకు మద్యం బాటిల్ ధర ₹150, ₹200 ఉంటే యథాతథంగా ఉంచుతారు. ఆ రేటుకు అర్ధరూపాయి ఎక్కువున్నా రౌండాఫ్ చేసి ₹160, ₹210 వసూలు చేస్తారు. ఒకవేళ సీసా ధర ₹90.5 ఉంటే రౌండాఫ్ ₹99 చేస్తారు. రూ.99కే నాణ్యమైన క్వార్టర్ మద్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 11, 2024

భారతీయులకు రాష్ట్రపతి దుర్గా పూజ శుభాకాంక్షలు

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గా పూజ ప్రతీక. అమ్మవారిని శక్తికి సంకేతంగా భావిస్తాం. ఐక్యతను, సర్వమత సమానత్వాన్ని చాటేందుకు ఈ పండుగ ఓ సందర్భం. మనందరికీ దుర్గమ్మ శక్తి, ధైర్యం, సంకల్పాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మహిళల్ని అత్యున్నతంగా గౌరవించుకుందాం’ అని పిలుపునిచ్చారు.